అసలు నేరస్థులని పట్డుకోవడానికి స్కిట్ చేస్తున్న దుగ్గిరాల కుటుంబం!
on Jul 13, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -772 లో..... కావ్య ఇంకా ఫోన్ చెయ్యలేదని రాజ్ ఆలోచిస్తుంటాడు. కాసేపటికి కావ్యకి ఫోన్ చేస్తాడు రాజ్. అప్పుని స్టేషన్ నుండి బయటకి తీసుకొని వచ్చావా అని రాజ్ అడుగగా... తీసుకొని వచ్చానని కావ్య అంటుంది. మరి ఆ విషయం నాకు చెప్పలేదు.. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అని రాజ్ అంటాడు. నేను టెన్షన్ లో ఉన్నాను.. అందుకే చెయ్యలేదని కావ్య అంటుంది.
ఇప్పుడైతే తీసుకొని వచ్చాను గానీ ఇంకా కేసు నుండి బయట పడలేదు కదా అని కావ్య అనగానే మీరేం టెన్షన్ పడకండి.. మనిద్దరం కలిసి అప్పుని కేసు నుండి బయటకు తీసుకొని వద్దామని రాజ్ అనగానే.. మీకెందుకు ఇబ్బంది అని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య ఫోన్ కట్ చేసాక అపర్ణ, ఇందిరాదేవి కావ్య దగ్గరికి వచ్చి ఎందుకు రాజ్ హెల్ప్ చేస్తానంటే వద్దని అంటున్నావని కోప్పడతారు. మరొకవైపు అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. అప్పు ఏడుస్తుంటే కళ్యాణ్ ఓదారుస్తాడు.
మరుసటిరోజు ఇంట్లో అందరు అప్పుని ఈ కేసు నుండి ఎలా బయటపడేయాలని ఆలోచిస్తుంటే అప్పుడే రాజ్ వస్తాడు. అప్పుని బయటకి తీసుకొని రావాలంటే ఏదో ఒక సాక్ష్యం ఉండాలని రుద్రాణి అంటుంది. కరెక్ట్ చెప్పారు అసలు స్టేషన్ లో ఏం జరిగిందో తెలియాలి . అందుకే మనం అందరం స్టేషన్ లో జరిగింది స్కిట్ రూపం లో చేద్దామని రాజ్ అంటాడు. రాహుల్ , రుద్రాణి స్టేషన్ కి వచ్చిన రౌడీ క్యారెక్టర్ అని రాజ్ అంటాడు. అప్పు అమాయకురాలు అనవసరంగా కేసులో ఇరికించావని అందరు రాహుల్, రుద్రాణీలని కొడతారు. దాంతో మాకు ఈ క్యారెక్టర్ వద్దని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



